థియేటర్లలోనే విరాటపర్వం విడుదల

ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు ఇప్పట్లో తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో  కొన్ని సినిమాలు ఓటిటి బాట పట్టగా మరికొన్ని సినిమాలు థియేటర్లలోనే విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. తాజాగా దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. థియేటర్స్‌ తెరుచుకొన్న తరువాతే దానిని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రానా అరణ్య శని విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ హిట్ కాలేకపోయింది. ఈ సినిమాకు వేణు ఉడుగల దర్శకత్వం వహించగా, డి.సురేష్ బాబు, సుధాకర్ చేకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇతర ముఖ్య పాత్రలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర నటించారు.