లాక్ డౌన్ లో బోయ్ ఫ్రెండ్ తో శృతి హాసన్..!

కమల్ గారాలపట్టి శృతి హాసన్ తన కొత్త బోయ్ ఫ్రెండ్ తో దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా తమిళనాడు సిఎం స్టాలిన్ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ టైం లో శృతి హాసన్ తన బోయ్ ఫ్రెండ్ శాంతా హాజారికతో కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇద్దరు దిగిన పిక్స్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది శృతి హాసన్.   

వుయార్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్న ఈ ఇద్దరు దిగిన ఈ పిక్స్ చూస్తుంటే సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని అర్ధమవుతుంది. శృతి హాసన్, శాంతాతో దిగిన పిక్స్ ఆమె ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గా తెలుగులో క్రాక్, వకీల్ సాబ్ రెండు సినిమాల్లో నటించి హిట్ అందుకున్న శృతి హాసన్ మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసిందని తెలుస్తుంది.