
కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో అరడజనుకు పగా సినిమాలు తీసింది. టాలీవుడ్ లో వచ్చిన స్టార్ క్రేజ్ తోనే కోలీవుడ్ ఆఫర్లు అందుకుంటుంది ఈ అమ్మడు. తమిళంలో కార్తీ సరసన సుల్తాన్ సినిమాలో నటించింది రష్మిక. చేసిన ఒక్క సినిమాకే తమిళ ప్రజల పద్ధతులు బాగా నచ్చాయని చెబుతుంది. సుల్తాన్ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించిన రష్మిక ఇక్కడ పద్ధతులు, ఆచారాలు.. ముఖ్యంగా తమిళ వంటలు తనకు బాగా నచ్చాయని అంటుంది రష్మిక. ఇవన్ని చూసి తనకు తమిళ ఇంటి కోడలు అవ్వాలని అనిపిస్తుంది అని తన మనసులోని కోరిక బయటపెట్టింది రష్మిక.
తమిళంలో చేసిన ఒక్క సినిమాకే రష్మిక ఇలా అనడం తెలుగు ఆడియెన్స్ ను ఇబ్బంది పెడుతుంది. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ఇక్కడ వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. అల్లు అర్జున్ పుష్పతో పాటుగా కొరటాల శివ ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమాలో రష్మిక నటిస్తుందని టాక్. ఇక కోలీవుడ్ లో కూడా విజయ్ 65వ సినిమాలో రష్మిక సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో రష్మిక ఓ రేంజ్ లో ఫాం కొనసాగిస్తుందని చెప్పొచ్చు.