
బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు కియరా అద్వాని. ఎమ్మెస్ ధోని సినిమాకు ముందు ఒక సినిమా చేసినా ధోని బయోపిక్ ఆమెకు మంచి క్రేజ్ తెచ్చింది. ఆ తర్వాత సినిమాలతో పాటు ఆమె చేసిన లస్ట్ స్టోరీస్ వెబ్ సీరీస్ ఆమెని పాపులర్ అయ్యేలా చేసింది. అదే క్రేజ్ తో తెలుగులో ఛాన్సులు అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో నటించిన కియరా అద్వాని ఆ సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది అమ్మడు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో హిందీ సినిమాలే చేస్తూ వచ్చింది.
లేటెస్ట్ గా కియరాకి మళ్లీ తెలుగులో క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా కియరాని సెలెక్ట్ చేసినట్టు టాక్. మహేష్, రాం చరణ్ లతో జోడీ కట్టిన కియరా ఇప్పుడు తారక్ తో జతకడుతుంది. కొరటాల శివ, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్లీ ఆ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.