
విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ 75వ సినిమా డైరక్టర్ ఎవరు అన్న దాని మీద కొద్దిరోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వెంకటేష్ చేస్తున్న నారప్ప, ఎఫ్3, దృశ్యం 2 పూర్తి కాగానే తన 75వ సినిమా మొదలు పెడతాడని అంటునారు. దృశ్యం 2, ఎఫ్3 దాదాపు పూర్తి కాగా నారప్ప సినిమాకు షూటింగ్ పెండింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత నారప్పని ఒకటి రెండు షెడ్యూల్ లో పూర్తి చేయాలని చూస్తున్నాడు వెంకటేష్.
ఇక ఇదిలాఉంటే వెంకీ 75వ సినిమా డైరక్టర్ కన్ఫాం అంటూ లేటెస్ట్ గా ఓ న్యూస్ వచ్చింది. అది ఎవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రం మహేష్ కాంబోలో సినిమా రాబోతుంది. త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఆ సినిమా తర్వాత త్రివిక్రం, వెంకటేష్ సినిమా ఉంటుందని టాక్. వెంకటేష్ 75వ సినిమా అది కూడా త్రివిక్రం డైరక్షన్ లో అనగానే అంచనాలు పెరిగాయి. రైటర్ గా ఉన్నప్పుడే వెంకటేష్ తో సూపర్ హిట్ కొట్టాడు త్రివిక్రం. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రం మాటలు అందించిన విషయం తెలిసిందే.