ఛత్రపతి రీమేక్.. సాయి పల్లవి షాక్..!

వరుస సినిమాలు చేస్తున్నా హిట్ కొట్టడంలో వెనకపడ్డాడు బెల్లంకొండ శ్రీనివాస్. భారీ బడ్జెట్ తో మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు చేస్తున్న అతను ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనకపడ్డాడు. తమిళ సూపర్ హిట్ మూవీ రాక్షసన్ రీమేక్ గా చేసిన రాక్షసుడు ఒకటి హిట్టు పడ్డది. ఈమధ్యనే వచ్చిన అల్లుడు అదుర్స్ కూడా నిరాశపరచింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో ఛత్రపతి సినిమా రీమేక్ జరుగుతుంది.

వి.వి.వినాయక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను పెట్టాలని అనుకున్నారు కాని కుదరలేదు. ఇక సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని ఈ రీమేక్ లో నటింప చేయాలని అనుకున్నారు. కాని మాములుగానే తన పాత్ర ప్రాధాన్యతని బట్టే సినిమాలు చేసే సాయి పల్లవి కమర్షియల్ సినిమాలో అది కూడా హిందీలో అంటే ఎలా ఒప్పుకుంటుంది.. పారితోషికం భారీగా ఆఫర్ చేసినా సరే సాయి పల్లవి ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తుంది. మొత్తానికి బెల్లంకొండ బాబుకి బాలీవుడ్ లో హీరోయిన్ దొరకట్లేదని మాత్రం అర్ధమవుతుంది.