
నితిన్, చంద్ర శేఖర్ యేలేటి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా చెక్. ఫిబ్రవరి 26న రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. ఇక ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రంజాన్ సందర్భంగా చెక్ సినిమా సన్ నెక్స్ట్ ఓటిటిలో రిలీజ్ అవుతుంది. థియేటర్ లో సందడి చేయలేని చెక్ కనీసం డిజిటల్ ఆడియెన్స్ ను అయినా మెప్పిస్తుందేమో చూడాలి.
ఈ సినిమాలో రకుల్ ప్రీతి సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. టెర్రరిస్ట్ గా ముద్ర పడి జైలులో ఖైదీగా ఉన్న హీరో చెస్ తో ఎలా ఛాంపియన్ అయ్యాడు. అసలు తన మీద పడిన ఆ ముద్రని ఎలా చెరిపేసుకున్నాడు అన్నది సినిమా కథ. చంద్రశేఖర్ యేలేటి కథలు చాలా యూనిక్ గా ఉంటాయి కాని అవి ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతున్నాయి. చెక్ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యింది.