RRR నుండి ఆగష్టు 15న సర్ ప్రైజ్..!

రాజమౌళి డైరక్షన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా RRR. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇండియన్ ఫ్రీడం ఫైటర్స్ అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ పాత్రలతో కల్పిత కథగా RRR వస్తుంది. ఈ సినిమా నుండి స్పెషల్ టీజర్ ఆగష్టు 15న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మే 20న ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్ వస్తుందని అనుకోగా ఆగష్టు 15న సినిమా స్పెషల్ టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ ఒలివియా మోరిస్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఎన్.టి.ఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మన్నెం దొర అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. అసలైతే అక్టోబర్ 13న సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా వేయడం పక్కా అని తెలుస్తుంది.