
ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రముఖ యుట్యూబ్ ఛానెల్ లో సినీ సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చిన తుమ్మల నరసింహా రెడ్డి ఇటీవల కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. టి.ఎన్.ఆర్ మృతి సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేసింది. 190 దాకా సినీ సెలబ్రిటీల ఇంటర్వ్యూస్ చేసిన టి.ఎన్.ఆర్ 200వ ఇంటర్వ్యూని తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవితో చేయాలని అనుకున్నారట. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
టి.ఎన్.ఆర్ మృతి పట్ల చిరంజీవి దిగ్బ్రాంతి కి గురయ్యారు. వారి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించారు చిరంజీవి. అంతేకాదు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా టి.ఎన్.ఆర్ ఫ్యామిలీకి తాను అండగా ఉంటానని అన్నారు. సంపూర్ణేష్ బాబు కూడా 50 వేల రూపాయలను టి.ఎన్.ఆర్ ఫ్యామిలీకి అందచేశారు.