
70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 సినిమాతో డైరక్టర్ గా తన ప్రతిభ చాటిన కరుణ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
ఇక ఈ ఫస్ట్ లుక్ టీజర్ చూస్తే లైటింగ్ సూరి బాబు పాత్రలో సుధీర్ బాబు అదరగొట్టాడని అనిపిస్తుంది. పలాస తర్వాత డైరక్టర్ కరుణ కుమార్ మరో విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీతో వస్తున్నాడని తెలుస్తుంది. శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోగా చూస్తుంటే సుధీర్ బాబు కెరియర్ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచేలా ఉంది.