
సూపర్ స్టార్ మహేష్ క్రికెట్ కోచ్ గా మారుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. సర్కారు వారి పాట తర్వాత రీసెంట్ గా త్రివిక్రం తో సినిమా ఎనౌన్స్ చేశారు మహేష్. ఈ సినిమాతో పాటుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో కూడా మరో సినిమా చేస్తాడని టాక్. ఈ సినిమాలో అనీల్ రావిపుడి మహేష్ ను క్రికెట్ కోచ్ గా చూపించబోతున్నాడని తెలుస్తుంది.
సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ కు సూపర్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపుడి సూపర్ స్టార్ తో మరో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. అయితే ఈ సినిమా ఎవరు నిర్మిస్తారు..? మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.