
సినీ జర్నలిస్ట్, ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూస్ చేస్తూ మెప్పించిన తుమ్మల నరసింహా రెడ్డి కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజులుగా కరోనాతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల నుండి టి.ఎన్.ఆర్ పరిస్థితి విషమని వార్తలు వస్తున్నాయి డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సరే లాభం లేకుండాపోయింది.
యూట్యూబ్ లో సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ కు సెపరేట్ క్రేజ్ వచ్చేలా చేశారు టి.ఎన్.ఆర్. గంట, రెండు గంటలు ఇంటర్వ్యూస్ చేస్తూ స్టార్స్ కు సంబందించిన విషయాలను ప్రేక్షకులను తెలిసేలా చేశారు. డైరక్టర్ అవ్వాలన్న కోరిక ఉన్న టి.ఎన్.ఆర్ ఈమధ్య నటుడిగా మెప్పిస్తున్నారు. టి.ఎన్.ఆర్ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది.