అల్లు అర్జున్ మరో సచిన్ అంటున్న కమెడియన్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను హార్డ్ వర్కింగ్ లో సచిన్ టెండుల్కర్ తో పోల్చాడు టాలీవుడ్ కమెడియన్ మధునందన్. టాలీవుడ్ లో కమెడియన్ గా మెప్పిస్తూ వస్తున్న మధునందన్ గుండె జారి గల్లతయ్యిందే సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ను సచిన్ తో పోల్చాడు మధునందన్. బన్నీ హార్డ్ వర్కింగ్ విషయంలో సచిన్ లా కృషి చేస్తాడని అన్నారు. ఆయన నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు. ఒక నటుడు ఎలా ఉండాలో బన్నీని చూశాకే తెలిసిందని మధునందన్ అన్నారు. తనలాంటి ఎంతోమందికి అల్లు అర్జున్ ఆదర్శంగా ఉంటున్నారని అన్నారు.     

ఓ నిర్మాత కొడుకుగా సినిమా కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయినా నిర్మాత తనయుడు ట్యాగ్ లైన్ తీసేసి సొంత టాలెంట్ తో మెప్పిస్తూ వచ్చాడు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా బన్నీ చేస్తున్న సినిమాలు ఒకదానికి మించి మరొకటి ఉంటున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు.