
ఉప్పెన భామ కృతి శెట్టి టాలీవుడ్ లో చేసిన మొదటి సినిమాకే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కన్నడ భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఉప్పెన హిట్ అవడంతో కృతి శెట్టికి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నటిస్తున్న అమ్మడు సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా నటిస్తుంది.
ఇక ఇదే కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అమ్మడు భాగమవుతుందని తెలుస్తుంది. లవర్ బోయ్ నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే అమ్మడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునేలా ఉంది. చేస్తున్న మూడు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్టైనా సరే కృతి శెట్టికి డబుల్ క్రేజ్ రావడం పక్కా అని చెప్పొచ్చు.