
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఐడ్రీం మీడియాలో ఫ్రాంక్లీ విత్ టీ.ఎన్.ఆర్ షో ద్వారా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ప్రేక్షకులను అలరించిన టీ.ఎన్.ఆర్ అలియాస్ తుమ్మల నరసింహా రెడ్డికి ఇటీవలే కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన కండీషన్ సీరియస్ గానే ఉందని తెలుస్తుంది. నెల క్రితమే తన సోదరికి కరోనా సోకిందని తన సోషల్ మీడియాలో తెలిపిన టీ.ఎన్.ఆర్ ప్రస్తుతం ఐసీయులో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది.
టీ.ఎన్.ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కరోనా వల్ల ఇప్పటికే సినీ సెలబ్రిటీస్ మృతి చెందారు. జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం టీ.ఎన్.ఆర్ కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.