
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సినిమా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రాధే శ్యాం, సలార్, ఆదిపురుష్ తో పాటుగా నాగ్ అశ్విన్ సినిమా లైన్ లో ఉండగా కొత్తగా లేడీ డైరక్టర్ సుధ కొంగర డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. గురు, ఆకాశం నీ హద్దురా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన డైరక్టర్ సుధ కొంగర ప్రభాస్ కోసం ఓ కథ సిద్ధం చేసిందట. ప్రభాస్ కు కథ నచ్చడంతో ఆమె డైరక్షన్ లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
అయితే రాధే శ్యామ్ ప్యాచ్ వర్క్ తో పాటుగా సలార్, ఆదిపురుష్ సినిమాలు పూర్తి చేసి నాగ్ అశ్విన్ సినిమాను కూడా కంప్లీట్ చేశాక సుధ కొంగర డైరక్షన్ లో ప్రభాస్ సినిమా చేసే అవకాశం ఉంది. ప్రభాస్, సుధ కొంగర కాంబినేషన్ లో ఎలా సినిమా వస్తుందో చూడాలి.