రెండు పార్టులుగా పుష్ప..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈ సినిమాను మత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తున్న పుష్ప సినిమా ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ప్రస్తుతం కరోనా ఉదృతంగా మారుతున్న కారణంగా అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. ఈ క్రమంలో పుష్ప సినిమా ఆగష్టు 13న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కూడా వయిదా పడుతుందని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా పుష్ప సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేస్తారని టాక్. పుష్ప పార్ట్ 1 అక్టోబర్ 13న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఆ డేట్ న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటుందని తెలుస్తుంది. మరి అల్లు అర్జున్ పుష్ప నిజంగానే రెండు పార్టులుగా తీస్తున్నారా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.