న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన మెయిల్..!

ఆహాలో రిలీజైన కంబాలపల్లి కథలు మెయిల్ చాప్టర్ 1 వెబ్ మూవీ న్యూ యార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈ ఇయర్ మొదట్లో ఆహాలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సెలెక్ట్ అయ్యింది. స్వప్నా సినిమాస్ బ్యానర్ లో స్వప్నా దత్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా ఆయనతో పాటు హర్షిత్, గౌరీ ప్రియా జోడీగా నటించారు.

కంబాలపల్లి ఊరిలో కొత్తగా కంప్యూటర్ వస్తే అక్కడ యువత ఎలా నేర్చుకోవాలని అనుకున్నారో.. దానితో పాటు కంప్యూటర్ లక్కీ డ్రా అంటూ జరిగే మోసాలను చూపించారు డైరక్టర్ ఉదయ్ గుర్రాల. ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలవడమే కాకుండా ఫిల్మ్ ఫెస్టివల్ కు సెలెక్ట్ అవడం చిత్రయూనిట్ ను ఖుషి చేస్తుంది.