త్రివిక్రం ఈసారి సిమ్రన్ ను తెస్తున్నాడు..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాను హాసిని హారిక క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. సినిమాలో పూజా హెగ్దే, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తారని టాక్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. త్రివిక్రం ప్రతి సినిమాలో ఒక సీనియర్ హీరో ఉండాల్సిందే. 

సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అరవింద సమేతలో దేవయాని, అల వైకుంఠపురములో సినిమాలో టబు ఇలా తన ప్రతి సినిమాలో సీనియర్ హీరోయిన్స్ కు స్పెషల్ రోల్ ఇస్తున్నారు. అయితే ఈసారి మహేష్ సినిమాలో సిమ్రాన్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఆమెకు ప్రాధాన్య ఉన్న పాత్ర ఇచ్చినట్టు టాక్. మహేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటుగా త్రివిక్రం సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ అఫీషియల్ అప్డేట్ వస్తుందని అంటున్నారు.