
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కబడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా అసలైతే ఏప్రిల్ 2న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ అవలేదు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ కన్నా డిజిటల్ రిలీజ్ బెటర్ అని భావిస్తున్నారట సీటీమార్ దర్శక నిర్మాతలు. ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్ కు మంచి బిజినెస్ జరిగినా దాన్ని మించి డిజిటల్ హక్కులు వస్తే సినిమా ఓటిటి రిలీజ్ కు రెడీ అన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం ఓటిటి సంస్థలతో సీటీమార్ దర్శక నిర్మాతలు డిస్కషన్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిర్మాత అనుకున్న కొటేషన్ వస్తే గోపీచంద్ సినిమా ఓటిటి లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సీటీమార్ మాత్రమే కాదు పరిస్థితి ఇలానే కొనసాగితే థియేటర్ రిలీజ్ ప్రకటించిన కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలన్ని డిజిటల్ రిలీజ్ బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.