
మొదటి సినిమా పిట్టగోడతో పెద్దగా ప్రతిభ చూపించలేని డైరక్టర్ కెవి అనుదీప్ సెకండ్ మూవీ జాతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, ఫరా అబ్ధుల్లా జంటగా నటించిన జాతిరత్నాలు సినిమా ఓ నవ్వుల వ్యాక్సిన్ లా పనిచేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో జాతిరత్నాలు సీక్వల్ ఉంటుందని ప్రకటించిన అనుదీప్ ఇప్పుడు ఆ సినిమాతో పాటుగా ఓ మార్షల్ ఆర్ట్స్ కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.
జాతిరత్నాలు సక్సెస్ ఇంటర్వ్యూస్ లో నవీన్ తో మరో సినిమా చేస్తానన్న డైరక్టర్ అనుదీప్ అతనితో ఓ లవ్ స్టోరీ తీస్తానని అన్నాడు. అయితే జాతిరత్నాలు 2తో పాటుగా మార్షల్ ఆర్ట్స్ కథ రెడీ చేస్తున్నాడట. అది నవీన్ పొలిశెట్టి కోసమే అని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి కామెడీతో మెప్పించిన ఈ డైరక్టర్ ఈసారి కమర్షియల్ సినిమాతో వస్తున్నాడని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.