
మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఉప్పెనతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఆ సినిమా రిలీజ్ అవకుండానే క్రిష్ డైరక్షన్ లో సెకండ్ మూవీ చేశాడు. సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు క్రిష్. సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
క్రిష్ ఈ సినిమాను ఓటిటి రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న టైం లో థియేట్రికల్ రిలీజ్ కష్టమని భావిచిన క్రిష్ వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ పెట్టబోతున్నట్టు టాక్. ఆల్రెడీ సినిమాకు ఆహా నుండి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. మరి క్రిష్ వైష్ణవ్ తేజ్ మూవీని ఆహాకి ఇస్తాడా లేక అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లలో రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.