
సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్దే, జాన్వి కపూర్ ఈ ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలని చూస్తున్నారు. అంతేకాదు సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఆ అవకాశాన్ని ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ అందుకుందని తెలుస్తుంది.
అంతకుముందు సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా సరే ప్రేక్షకులను అలరించని నిధి అగర్వాల్ పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో అమ్మడు పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న సినిమాలో చేస్తున్న నిధి అగర్వాల్ మహేష్ త్రివిక్రం కాంబో సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని టాక్. మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే నిధి క్రేజ్ డబుల్ అయినట్టే లెక్క.