
టాలీవుడ్ స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి నెక్స్ట్ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫాం అయ్యిందని తెలుస్తుంది. మహేష్ తో మహర్షి సినిమా తీశాక స్టార్ హీరోలెవరు డేట్స్ ఇవ్వకపోవడంతో ఖాళీగా ఉన్నాడు వంశీ పైడిపల్లి. తెలుగు హీరోలెవరు ఛాన్స్ ఇచ్చేలా లేరని తమిళ స్టార్ హీరోలపై కన్నేశాడు. ఫైనల్ గా తమిళ స్టార్ థళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా కన్ఫాం అని అంటున్నారు. ఈ సినిమా దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది.
విజయ్ డైరెక్ట్ గా తెలుగులో చేస్తున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. విజయ్ స్టోరీ లైన్ ఓకే చేయగా యూఎస్ ట్రిప్ లో ఉన్న దిల్ రాజు తిరిగి వచ్చాక ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా యాక్షన్ తో పాటుగా ఎమోషనల్ గా సాగే కథతో వస్తుందని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి మార్క్ మూవీగా సినిమా ఉంటుందట. మొత్తానికి వంశీ పైడిపల్లి విజయ్ తో జాక్ పాక్ కొట్టేశాడని అనుకుంటున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ బహషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది.