ఫ్యాన్ మృతి.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ ట్వీట్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్ మరణవార్త విని ఎమోషనల్ అయ్యారు. ఈమధ్యనే అతనితో వీడియో కాల్ లో మాట్లాడిన విజయ్ అతను మరణిచాడన్న వార్త విని షాక్ అయ్యాడు. నువ్వు భౌతికంగా లేకపోయినా నువ్వు నా జీవితాంతం గుర్తుంటావు అంటూ విజయ్ దేవరకొండ ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. తనతో వీడియో కాల్ మాట్లాడే ఏర్పాటు చేసిన వారికి థ్యాంక్స్ చెప్పాడు.

ఈమధ్య కాలంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలెంట్ తో పైకొచ్చిన వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. అలాంటి విజయ్ కు హేమంత్ లాంటి ఫ్యాన్స్ చాలామంది ఏర్పడ్డారు. దురదృష్టవశాత్తు హేమంత్ అనారోగ్య కారణాల వల్ల మరణించాడు. హేమంత్ ఇక లేడన్న వార్త విన్న విజయ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో తన మెసేజ్ తో మిగతా ఫ్యాన్స్ మనసులు గెలిచాడు.