చరణ్ విలన్ గా కన్నడ స్టార్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ తను చేస్తున్న ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాల తర్వాత సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ గురించి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. జూలై 15న సెట్స్ మీదకు వేళ్తున్న ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ సుదీప్ ని ఫిక్స్ చేశారని టాక్.

కన్నడలో స్టార్ హీరోగా చేస్తూనే తెలుగులో విలన్ గా, చిన్న చిన్న పాత్రలను చేస్తున్నారు సుదీప్. ఈగ తో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ బాహుబలి, సైరా సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీలో విలన్ గా మరోసారి సుదీప్ తన టాలెంట్ చూపించాలని చూస్తున్నారు.