మహేష్, త్రివిక్రం ఎనౌన్స్ మెంట్ వచ్చేసిందోచ్..!

సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉన్న ఈ కాంబో మూవీ ఫైనల్ గా ఫిక్స్ అయ్యింది. హారిక హాసిని క్రియేషన్స్ లో మహేష్, త్రివిక్రం హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రం తో మహేష్ మూడవ సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా ఎందుకో కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ కాంబో సినిమా ఫిక్స్ అయ్యింది.

మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం సినిమా ఉంటుందని తెలుస్తుంది. మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి. సినిమాలో మహేష్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. త్రివిక్రం సినిమా అందులోనూ మహేష్ తో అంటే ఇక ఆ సినిమా అంచనాలు తారాస్థాయిలో ఉన్నట్టే. ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.