
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని అంటున్నారు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ తో వస్తూ కమర్షియల్ హిట్లు కొడుతున్నాడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
సినిమాలో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తాడని తెలియగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎన్.టి.ఆర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ అంటే సినిమాపై స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ కొట్టారు. మరి హిట్ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే 2022 ఏప్రిల్ 29న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు.