
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక రాం తో డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని టాక్. రాం తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సీక్వల్ గా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా మాస్ మహరాజ్ రవితేజతో పూరీ సినిమా ఉంటుందని అంటున్నారు. రవితేజ, పూరీ కాంబో సినిమా అంటే మాస్ ఆడియెన్స్ కు పండుగే.
రవితేజ కోసం ఈసారి మెగా స్టోరీని వాడేస్తున్నాడట పూరీ జగన్నాథ్. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవి కోసం పూరీ జగన్నాథ్ ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. ఆటో జాని టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడు. చిరుకి కథ నచ్చినా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడు. అయితే చిరు కాదన్నా సరే ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు పూరీ. ఫైనల్ గా చిరు నుండి గ్రీన్ సిగ్నల్ రావడం కష్టమని భావించి రవితేజతో ఆ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడు.
రవితేజ హీరోగా పూరీ డైరక్షన్ లో ఆటోజానీ సినిమా వస్తే మాత్రం ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుంది. ప్రస్తుతం రవితేజ ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.