
కరోనా వల్ల మరో యువ దర్శకుడు మృతి చెందాడు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మా అబ్బాయి సినిమాను డైరెక్ట్ చేసిన వట్టి కుమార్ పరశురాం దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ వచ్చాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు కూడా అసోసియేట్ డైరక్టర్ గా పనిచేస్తున్నాడని తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ టైం లోనే కరోనా బారిన పడ్డ వట్టి కుమార్ గురువారం ప్లాస్మా థెరపీ చేయించుకోగా హార్ట్ ఎటాక్ రావడంతో కన్నుమూశారు.
శ్రీకాకుళం కు చెందిన వట్టి కుమార్ డైరక్టర్ గా మరో సినిమాకు ఓ బ్యానర్ తో డిస్కషన్స్ కూడా ముగిశాయని తెలుస్తుంది. త్వరలోనే సినిమా ఎనౌన్స్ మెంట్ చేసేలోగా వట్టి కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. తెలుగు రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత బాగా ఉంది. సినీ పరిశ్రమలో కూడా కరోనా ఎఫెక్ట్ చూపిస్తుంది. వట్టి కుమార్ మరణ వార్త విని సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. వట్టి కుమార్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నారు సినీ పెద్దలు.