ఆరెక్స్ పాయల్ మళ్ళీ అలాంటి రోల్..!

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న పాయల్ రాజ్ పుత్ మరో సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తుంది. సినిమాలైతే చేస్తుంది కాని ఫలితాలు నిరాశపడటంతో మరోసారి తనకు గుర్తింపు తెచ్చిన నెగటివ్ పాత్రతోనే ఇంప్రెస్ చేయాలని చూస్తుంది. ప్రస్తుతం పాయల్ సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లను చేస్తుంది. లేటెస్ట్ గా ఆహా కోసం ఓ కొత్త వెబ్ సీరీస్ సైన్ చేసినట్టు తెలుస్తుంది. త్రీ రోజెస్ టైటిల్ తో వస్తున్న ఈ సీరీస్ లో పాయల్ మరోసారి రెచ్చిపోతుందని తెలుస్తుంది.

ఈ వెబ్ సీరీస్ లో ఆమె పాత్ర నెగటివ్ గా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఆమె గ్లామర్ డోస్ కూడా పెంచేస్తుందని అంటున్నారు. మొత్తానికి ఆరెక్స్ 100 తర్వాత పాయల్ రాజ్ పుత్ మళ్ళీ అలాంటి పాత్రలో నటిస్తుందని టాక్. పాయల్ ఫ్యాన్స్ కు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ తో కూడా అమ్మడు చేస్తున్న హంగామా ఆడియెన్స్ ను అలరిస్తుంది.