
తమిళంలో సూపర్ హిట్టైన జాను సినిమాను తెలుగులో జానుగా తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో శర్వానంద్, సమంతలు నటించారు. మాత్రుక దర్శకుడు ప్రేమ్ తెలుగు వర్షన్ ను డైరెక్ట్ చేసినా తెలుగులో ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడంలో విఫలమైంది. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా గోవింద్ వసంత్ మ్యూజిక్ మాత్రం జానుకి హైలెట్ గా నిలిచింది. 96లోని పాటలనే ఇక్కడ రిపీట్ చేసినా తెలుగు వర్షన్ సాంగ్స్ కు ప్రత్యేక ఆదరణ లభిస్తుంది.
ఇక సినిమాలోని మొదటి సాంగ్ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. ఈ సినిమా సాంగ్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. లైఫ్ ఆఫ్ రామ్ మాత్రమే కాదు ఈ పాట విన్న వారంతా తమ జీవితం గురించి ఆలోచించేలా ఈ పాట ఉంటుంది. లైఫ్ ఆఫ్ రాం సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి శర్వానంద్ కెరియర్ లో బెస్ట్ సాంగ్ గా ఇది నిలిచింది.