తెర మీద మెగా డాటర్..!

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.. ఇంకా ఇస్తూనే ఉన్నారు. అయితే హీరోలుగా చేయడం వేరు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం వేరు.. మెగా బ్రదర్ నాగ బాబు తనయురాలు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. ముందు వెబ్ సీరీస్ తో మెప్పించిన నిహారిక ఆ తర్వాత సినిమాలు చేసింది. అయితే సిల్వర్ స్క్రీన్ పై అమ్మడికి కమర్షియల్ సక్సెస్ రాలేదు. అందుకే తనకు కలిసి వచ్చిన వెబ్ సీరీస్ లనే చేయాలని చూస్తుంది నిహారిక.

ఇక ఇదిలాఉంటే మెగాస్టార్ తనయురాలు సుస్మిత కూడా వెండితెర మీదకు వస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే కాస్టూం డిజైనర్ గా చేస్తున్న సుస్మిత నిర్మాతగా కూడా వెబ్ సీరీస్ నిర్మించింది. ఇవి చాలదు అన్నట్టు ఇప్పుడు తెర మీదకు వచ్చేందుకు రెడీ అవుతుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 8 తొట్టికల్ సినిమా రీమేక్ లో మెగా డాటర్ సుస్మిత నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో ఆమెను తీసుకున్నారట. ఈ సినిమాకు సంబందించిన పూర్తి డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.