
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ F3. అనీల్ రావిపుడి డైరక్షన్ లో సూపర్ హిట్టైన F2 సినిమాకు కొనసాగింపుగా F3 చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్న, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని F3 రిలీజ్ వాయిదా వేసి 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
2019 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అయ్యింది F2. మళ్లీ అదే సెంటిమెంట్ తో సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ ఇయర్ ఆగష్టు రిలీజ్ అనుకున్నా సరే కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల సినిమాలన్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇలాంటి టైం లో 2022 సంక్రాంతికి ఎఫ్3 రిలీజ్ ఫిక్స్ చేశారని టాక్. అనీల్ రావిపుడి F3 తర్వాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్.