బాలకృష్ణ, అనీల్ రావిపుడి కాంబో మూవీకి క్రేజీ బడ్జెట్..!

నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సినిమా దాదాపు కన్ఫాం అయినట్టే అని తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో అఖండతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలయ్య బాబు ఆ తర్వాత సినిమా అనీల్ రావిపుడితో చేస్తాడని టాక్. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు అనీల్ సినిమా తీస్తే హిట్ అన్నట్టే లెక్క. 

డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా అనీల్ రావిపుడి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే. బాలయ్య బాబుతో అనీల్ రావిపుడి మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ 75 కోట్ల దాకా ఉంటుందని టాక్. అనీల్ రావిపుడి మీద ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి అనీల్ బాలయ్య కాంబో ఎలాంటి సినిమా చేస్తారో చూడాలి. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఈ కాంబినేషన్ గురించి తెలియగానే ఫుల్ ఖుషిగా ఉన్నారు.