సారంగ దరియా రికార్డులు కొడుతూనే ఉంది..!

శేఖర్ కమ్ముల డైరక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాలో సారంగ దరియా సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 28న సారంగ దరియా సాంగ్ లిరికల్ వీడియో రిలీజైంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుండి యూట్యూబ్ లో వ్యూస్ తో రికార్డులు కొడుతూనే ఉంది. అతి తక్కువ టైం లో 50 మిలియన్ వ్యూస్.. అదే వేగంతో 100 మిలియన్లు.. ఇప్పుడు 150 మిలియన్లతో దూకుడు చూపిస్తుంది సారంగ దరియ సాంగ్.

సాయి పల్లవి సినిమాలోని సాంగ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ తరహాలోనే లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా సాంగ్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సాంగ్ యూట్యూబ్ లో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీ సినిమాకు కావాల్సిన బజ్ ఈ ఒక్క పాటే తెచ్చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవిల జోడీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న ఈ సినిమా అసలైతే ఏప్రిల్ 16న రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరగడంతో సినిమా రిలీజ్ వాయిదా వేశారు.