
స్టార్స్ సినిమా ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి వెళ్తే దాని రిజల్ట్ గురించి, చేస్తున్న హీరోతో పాటు, మిస్ చేసుకున్న హీరో కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తుంటాడు. ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేస్తున్న ఫిదా మూవీ గురించి ఓ సెన్షేషన్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కథ ముందు మహేష్ బాబుకి చెప్పాడట. అయితే కొద్ది కాలంగా ట్రాక్ తప్పి తన మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు దూరంగా ఉన్న మహేష్, కమ్ముల ఆఫర్ ను కూడా రిజక్ట్ చేశాడు. దానికి కారణం ఏదైనా ఆ మూవీ మిస్ అయిన మహేష్ ఇప్పుడు మురుగదాస్ సినిమా చేస్తున్నాడు.
అయితే ప్రస్తుతం ఆ కథతో శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ తో ఫిదా మూవీ చేస్తున్నాడు. కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పిన మెగా ప్రిన్స్, ఈ సినిమాతో తన ఎకౌంట్ లో హిట్ గ్యారంటీ అంటున్నాడట. ఓ పక్క శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఫిదాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెండు నెలల క్రితం స్టార్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది. మలయాళ ప్రేమం బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా, అమెరికా కుర్రాడు తెలంగాణ అమ్మాయి ప్రేమకథతో రాబోతుందని టాక్.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటిదాకా ఏమో గాని ఎప్పుడైతే మహేష్ కాదన్నాడు అని తెలిసిందో, అప్పటినుండి సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మహేష్ తన డేట్స్ వల్లనే ఈ సినిమా మిస్ చేసుకున్నాడట.. కథ నచ్చినా చేసే పరిస్థితుల్లో లేకనే సినిమా వదిలాడట మహేష్. ఇక అదే కథతో కమ్ముల వరుణ్ తేజ్ తో ఫిదా అంటున్నాడు. మరి మహేష్ సినిమా లాక్కున్న మెగా ప్రిన్స్ సినిమా రిజల్ట్ ను ఏ రేంజ్ లో అందుకుంటాడో చూడాలి.