'కాటమరాయుడు', పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్ ఖరారు

పవర్‌స్టార్‌ పవన్‌ కాళ్యాణ్‌ తాజాగా డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవల ప్రారంభం చేసుకుని ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ అధికారికంగా ఫిక్స్‌ కాలేదు. గతంలో ‘కడప కింగ్‌’ వంటి టైటిల్‌లు ప్రచారం అయ్యాయి. తాజాగా ‘కాటమరాయుడు’ టైటిల్‌ ఫిక్స్‌ అయ్యే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇవాళ పవన్‌కళ్యాణ్‌ పుట్టినరోజు కావడంతో ఆ విషయంపై మాట్లాడిన ఈ చిత్ర నిర్మాత తాజాగా ‘కాటమరాయుడు’ టైటిల్‌ను ఖరారు చేశాడు. 

నేడు పవన్‌ పుట్టిన రోజు  అవ్వడంతో ఈ చిత్ర టైటిల్ కార్డు రాత్రి 12 గంటలకు చిత్ర నిర్మాత శరత్ మర్రార్ విడుదల చేశారు. ఈ చిత్రంలో పవన్‌ సరసన అందాలభామ శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కాటమరాయుడు’ టైటిల్‌ బాగా సూట్‌ అయ్యిందని అభిమానులు సంతోషపడుతున్నారు. అంతే కాకుండా పవన్‌ పుట్టిన రోజు వేడుకలను జరపడానికి అభిమానులు చాలా సందడి చేస్తున్నారు.