లీక్ తర్వాత జాగ్రత్తలు పాటిస్తున్న మహేష్

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తాజాగా మురుగదాస్‌తో కలిసి ఓ సినిమా  చేస్తున్నాడు. నెల రోజుల క్రితం షూటింగ్‌ ప్రారంభం చేసిన చిత్ర యూనిట్‌ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుతున్నారు. ఈ చిత్రంలో అందాలభామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని మహేష్‌ స్టిల్‌ ఒకటి లీక్‌  ఐన విషయం తెలిసిందే. ఆ ఫొటో చూస్తే మహేష్ ఈ సినిమాలో కాలేజీ కుర్రాడిలా చాలా యవ్వనంగా కనిపిస్తున్నాడు.

లీకైన ఫోటో కి కలవరపడుతున్న చిత్ర యూనిట్, ప్రస్తుతం షూటింగ్ వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేసింది. ఎవరూ ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైవిధ్యభరితమైన కథతో ఒక మెసేజ్‌ ఓరియెంటెడ్‌ చిత్రంగా ఈ చిత్రాన్ని మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ సంగీతాన్ని అందించనున్నారు.  ఈ చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఠాగూర్‌ మధు మరియు ఎన్‌ వి ప్రసాద్‌లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.