
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న చిత్రానికి చాలా ఆసక్తి కలిగించే దువ్వాడ జగన్నాధం అనే పేరు ఖాయం చేశారు. హైదరాబాద్ లో సోమవారం ఈ పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలయింది. సెప్టెంబర్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
నేడోరేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ కాజల్ కనుక ఈ సినిమాని దక్కించుకొన్నట్లయితే ఆమె దశ మళ్ళీ తిరిగినట్లే భావించవచ్చు. ఆమె నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలు రెండూ ఫ్లాప్ అవడం ఆమెకి చాలా ఇబ్బందికర పరిస్థితులని ఎదుర్కొంది. అయినా ఆమె అదృష్టం బాగుండటంతో ఖైదీ నెంబర్:150 సినిమాలో చిరంజీవి పక్కన నటించే అవకాశం దక్కించుకొంది. మళ్ళీ వెంటనే అల్లు అర్జున్ సినిమాలో కూడా హీరోయిన్ అవకాశం దక్కించుకోవడం విశేషమే. జూ.ఎన్టీఆర్, సమంత, నిత్యా మీనన్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్ చేస్తోంది. ఆ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. ఇవికాక ఆమె చేతిలో మరో రెండు తమిళ్ సినిమాలు కూడా ఉన్నాయి. కనుక రెండు ఫ్లాపులు వచ్చినా కాజల్ కి ఈ ఏడాది కూడా చాలా బాగానే సాగిపోయినట్లు చెప్పవచ్చు.