అలాంటి ఫ్యాన్స్ నాకొద్దు - ఎన్టీఆర్

పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన పవన్ అభిమాని విషయంలో ఎన్టీఆర్ ఎట్టకేలకు స్పందించారు. అభిమానులు ముందుగా దేశాన్ని, ఆ తర్వాత తల్లి తండ్రులను, ఆ తర్వాత భార్య బిడ్డలను ప్రేమించాలని, వారి తర్వాతే చివరగా అభిమాన నటుడు గుర్తుకు రావాలని అన్నారు. 

సినీ రంగంలో అందరు హీరోలు ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటామని, అభిమానులు కూడా అలాగే ఉండాలని, అభిమానం పేరుతో చంపుకోవద్దని, అలా హింసకు పాల్పడితే అలాంటి అభిమానులు నాకొద్దని తేల్చి చెప్పారు. తారక్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్, నందమూరి అభిమానులే కాకుండా, పవన్ అభిమానులకి కూడా నచ్చడం, సోషల్ మీడియా లో ఎన్టీఆర్ ని కొనియాడడం విశేషం.