చిరు 150వ చిత్రం టైటిల్ ఖరారు, ఫస్ట్ లుక్ హోరు

ఆగస్ట్ 22..మెగాస్టార్ మళ్ళీ పుట్టిన రోజు. ‘మళ్ళీ’ ఎందుకంటే సుమారు 9 ఏళ్ల రాజకీయ ఇంటర్వెల్ తరువాత మళ్ళీ ఈ ‘ఖైదీ నెంబర్:150’ తో తన సెకండ్ ఇన్నింగ్స్ మరో మెగాపరీక్షని ఎదుర్కోబోతున్నారు. కనుక ఈ సినిమా విజయవంతం అయినట్లయితే అది ఆయనకి నిజంగానే పునర్జన్మగానే భావించవచ్చు. చిరంజీవి సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన క్రేజ్..మార్కెట్ ఉంటుంది. కనుక ఈ ‘ఖైదీ నెంబర్:150’ కోసం కూడా ఆభిమానులు, బయ్యర్లు అందరూ చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఖైదీ నెంబర్:150 ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అంతకంటే ముందు ప్రీ-ఫస్ట్-లుక్ అంటూ వినూత్నమైన ప్రయోగం చేశారు. గురువారం సాయంత్రం విడుదల చేసిన ఈ ప్రీ-ఫస్ట్-లుక్ లో సినిమాకి సంబందించిన క్లిప్పింగ్స్ ఏవీ లేవు కానీ యూనిట్ మెంబర్స్ తదితరుల క్లిపింగ్స్ ఉన్నాయి. చిరంజీవిని డార్క్ షాడోగా మాత్రమే చూపించారు. ఈ ప్రీ-ఫస్ట్-లుక్ వీడియోలో ఎక్కడా సినిమా పేరు ఇవ్వకపోవడం విశేషం. కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ బ్యానర్ చూపించి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ తేజ్, దర్శకుడు వివి నాయక్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరుల వీడియో క్లిప్పింగ్స్ చూపారు.

దానిలో మొదట వారియర్ ఆఫ్ 149 మూవీస్ అని వస్తుంది. ఆ తరువాత ఎంపరర్ ఆఫ్ 37 ఇయర్స్ అని చూపించారు. తరువాత కాంకరర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ అని చూపించారు. ఈ మూడు చోట్ల కూడా చిరంజీవి కనబడతాడు కానీ డార్క్ షేడ్ లో మాత్రమే. ఈ క్లిప్పింగ్స్ లో ఒకసారి చిరంజీవి బూట్లు మాత్రమే కనబడే విధంగా చిన్న స్టెప్ చూపించారు కూడా. మొత్తం మీద ఈ ప్రీ-ఫస్ట్-లుక్ కూడా అందరినీ చాలా ఆకట్టుకొనే విధంగానే ఉంది.


చాలా అంచనాలతో తయారవుతున్న ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని చిరంజీవి మళ్ళీ తన అభిమానులకి ఆనందపరచాలని కోరుకొంటూ, ఆయనకి mytelangana.com జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.