
బాహుబలి మొదటి భాగం షూటింగ్ సుమారు రెండేళ్ళపాటు సాగింది. ఇప్పుడు బాహుబలి రెండవ భాగం తయారవుతోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28న సినిమాని రిలీజ్ చేసేందుకు దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసుకొంటున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది. కానీ అందులో ప్రభాస్ కి జంటగా నటిస్తున్న అనుష్క తోనే చికొచ్చిపడింది. ఆమె బాహుబలి సినిమా తరువాత మధ్యలో సైజ్ జీరో సినిమా కోసం సుమారు 20 కేజీలు బరువు పెరగారు. ఆ సినిమా హిట్ అవలేదు కానీ ఆమె పెరిగిన బరువు మాత్రం అలాగే మిగిలిపోయింది.
బాహుబలి రెండవ భాగం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కనుక ప్రభాస్ తో అనుష్క డ్యాన్సులు, రొమాన్స్ సీన్లు చాలానే  ఉండవచ్చు కనుక అందులో అనుష్క చాలా అందంగా, నాజుకుగా కనిపించాల్సి ఉంటుంది. కానీ ఆమె అనుకొన్నంత వేగంగా బరువు తగ్గలేకపోవడంతో ఆమె చేయవలసిన పోర్షన్ అంతా పక్కనపెట్టేసి రాజమౌళి మిగిలిన పాత్రలతో సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. కానీ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అనుష్క లేకుండా ఉన్న సన్నివేశాల షూటింగ్ పూర్తయిపోతే తరువాత ఏమి చేయాలి? అనుష్కతో కలిసి చేయవలసిన వారి డేట్స్ అయిపోతే పరిస్థితి ఏమిటి? అని రాజమౌళి చాలా ఆందోళన చెందుతున్నారుట. అనుష్క కూడా సైజ్ జీరో సినిమా చేసినందుకు బాధపడకపోయినా, ఇటువంటి సమయంలో అలాంటి ప్రయోగాలు చేసినందుకు బాధపడుతున్నారట! కానీ ఇప్పుడు ఆమె మాత్రం ఏమి చేయగలరు..వేగంగా బరువు తగ్గే ప్రయత్నాలు తప్ప! ఆమె బరువు తగ్గి మళ్ళీ నాజుకుగా తయ్యరయ్యే వరకు రాజమౌళి గెడ్డం నిమురుకొంటూ ఎదురుచూడక తప్పదు.