సాయి ధరం తేజ్ కి ఎందుకీ తిక్క?

సాయి ధరం తేజ్ కి ఎందుకీ తిక్క?ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. ఆ తిక్కని జనాలకి చూపించుకోవడానికి మొదట థియేటర్లు దొరకనప్పుడే చాలా తిక్క వచ్చిందిట! తీరా చేసి థియేటర్లు సర్దుబాటు చేసుకొని తన తిక్కని ప్రదర్శించుకొన్నా, సినీ విశ్లేషకులు ‘ఛీ ఈ తిక్క ఏమిటి దీనికి అసలు లెక్కే లేదు’ అంటూ 5కి 1 నుంచి 1.5 మార్కులే వేసి తమ తిక్క చూపించుకొన్నారు. అయినా ఆ తిక్క ఎలాగుంటుందో స్వయంగా చూద్దామని థియేటర్లకి వచ్చిన జనాలకి కూడా ఆ తిక్క పుట్టించిందిట! అందుకే వాళ్ళు కూడా ‘ఇదేమి తికమక సినిమా’ అని అనుకొంటూ ఆ థియేటర్లవైపు రావడం మానేశారుట! కొన్ని ప్రధాన సెంటర్లలో డబ్బాలు భద్రంగా వెనక్కి తిప్పి పంపేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ తిక్కకీ ఓ లెక్క ఉందనే టాక్ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘రేయ్’ సినిమా తరువాత ధరం తేజాకి కొంచెం గ్యాప్ వచ్చింది. దిల్ రాజుతో ఓ సినిమాకి సైన్ చేసినప్పటికీ, ఆయన కూడా ఆ సమయంలో ఆర్ధికంగా కొంచెం ఇబ్బందులలో ఉండటంతో అడ్వాన్స్ ఏమీ ఇవ్వలేకపోయారుట! సరిగ్గా అప్పుడే తిక్కకి చెక్ చేతిలో పడటంతో ముందూ వెనుకా చూడకుండా దానికి ఓకే చెప్పేశాడట. అదీ తిక్క వెనుక లెక్క. అంతవరకు బాగానే ఉంది కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత మాత్రం పూర్తిగా లెక్క తప్పింది. దానిపై 18కోట్లు తగలేస్తే అందులో సగం కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు అనేది టాక్.