జనతాగ్యారేజ్ ట్రైలర్ టాక్

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ జనతాగ్యారేజ్ ట్రైలర్ విడుదలైంది. కొరటాల శివతో ఎన్టీఆర్, మోహన్ లాల్ తో కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ ను ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా విడుదల చేశారు. ట్రైలర్ లోనే కొరటాల శివ మొత్తం కథను చెప్పేశారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆనంద్ అనే క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆనంద్ నేచర్ లవర్.. ప్రకృతి అన్నా, చెట్లన్నా ప్రాణం. మరోపక్క  జనతాగ్యారేజ్ ఓనర్ గా మోహన్ లాల్ కనిపిస్తారు. 

జనాల కోసం ఎప్పుడూ తాపత్రయపడే మనిషిగా మోహన్ లాల్ చాలా కూల్ గా కనిపించారు. ప్రకృతి మనుషులను, చెట్లను కాపాడలన్నట్లు మోహన్ లాల్ ను, ఎన్టీఆర్ ను కలిపింది అన్నట్లు ట్రైలర్ లో చూపించాడు. వీరిద్దరు ఎలా కలిశారు.? ఎందుకు కలిశారు..? అనే స్టోరీతో ఈ సినిమా వస్తున్నట్లు అంచనా వేసుకొవచ్చు. ఎన్టీఆర్, మోహన్ లాల్ లు అదిరిపోయే పర్ఫామెన్స్ చేస్తే, సమంత, నిత్యాలు అల్లరి చేశారు. ఇక ఈ ట్రైలర్ లో దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.