
తెలుగు సినిమా చరిత్రలో మరో అధ్యాయాన్ని లిఖించడానికి వస్తున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. టాలీవుడ్ లో ఆణిముత్యాల్లాంటి సినిమాలను అందించిన క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ముందుగా దేవిశ్రీప్రసాద్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారట. క్రిష్ పెళ్లి హడావిడిలో పడి సినిమాకు కాస్త దూరంగా ఉన్నాడు. ఈలోపు దేవి కనీసం ఓ మూడు పాటలు రికార్డు చేసి ఉంటారు అనుకుంటే.. కనీసం ఒక్క పాట కూడా రికార్డు చెయ్యలేదట.
ఇప్పటి దాకా పాట కూడా కంపోజ్ చెయ్యని దేవిశ్రీప్రసాద్.. క్రిష్ కు మరికొన్ని రోజుల టైం అడిగారట. సంక్రాంతి బరిలో దించాలని ముందు నుండి ప్లాన్ వేసుకున్న క్రిష్ దానికి ఒప్పుకోలేదని సమాచారం. దాంతో దేవిశ్రీప్రసాద్ ను ఈ ప్రాజెక్టు నుండి తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. దేవి బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండరని.. కాబట్టి మ్యాస్ట్రో ఇళయరాజాను సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్.