నాగచైతన్య ప్రేమను ఒప్పుకున్న సమంత!

నాగ చైతన్య వెడ్స్ సమంత అంటూ చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయంపై అటు అక్కినేని కుటుంబం నుంచి గాని.. ఇటు సమంత తరపు నుంచి గాని ఎటువంటి స్పష్టత రాలేదు. కాని నేడు సమంత ట్విట్టర్ లో చేసిన రీట్వీట్ తో అసలు విషయం బయటికి చెప్పినట్లు అయ్యింది. నాగచైతన్య ‘ప్రేమమ్’ సినిమాకు సంబంధించిన మూడు వైవిధ్యమైన గెట్ అప్ లలో ఉన్న ఫోటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

ఆ పోస్ట్ ను సమంత తిరిగి రీట్వీట్ చేశారు. మొట్ట మొదటిసారి ఇలా బహిరంగంగా ఆమె ప్రేమ వ్యక్తం చేశారు. అటు నాగార్జున కూడా మా కొడుకులు ఇద్దరు తమ లైఫ్ పార్ట్ నర్స్ ను వెతుక్కున్నారని ఆ మధ్య ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. అయితే చైతన్య పెళ్లి ముందుగా ఉంటుందని, అఖిల్ పెళ్లి ఇప్పట్లో ఉండదని కూడా నాగ్ తెలిపారు.