జనతాగ్యారేజ్ కు రెండు క్లైమాక్స్ లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న జనతాగ్యారేజ్ మీద భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా విషయంలో డైరెక్టర్ కొరటాల శివ చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాడు. తెలుగులోనే కాక మలయాళంలో కూడా తన మార్కెట్ ను పెంచుకోనే ఉద్దేశంతో సినిమాలోకి మోహన్ లాల్ ని కూడా దింపాడు. అందుకే ఈ సినిమా కోసం రెండు భాషల్లో టీజర్లను తయారు చేసి ఒకటి తెలుగు ఆడియోన్స్ కు రిలీజ్ చేయగా, మరొకటి మలయాళ ప్రేక్షకులకు రిలీజ్ చేశారట. అయితే మలయాళ వెర్షన్లో మోహన్ లాల్ హీరో అన్నట్లుగా టీజర్ను రూపొందించారు. 

ఈ సినిమాలో మరో ట్విస్ట్ … కేవలం మలయాళ టీజర్లోనే కాదు సినిమాలో కూడా దాదాపు ఆయనే హీరో అన్నట్లుగా చూపించనున్నట్లు సమాచారం. సినిమా క్లైమాక్స్ ను మార్చినట్లు తెలుస్తుంది. తెలుగులో ఎన్టీఆర్ ను ప్రధానంగా తీసుకొని చేస్తే, మలయాళంలో మోహన్ లాల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాతో కేరళలో స్టార్ డం సంపాందించాలనుకుంటున్న ఎన్టీఆర్, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.