
కొత్త కొత్త గెటప్ లతో ఎప్పుడూ ప్రయోగాలు చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడు తమిళ హీరో విక్రమ్. కమల్ హాసన్ తర్వాత అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లను వేసే సత్తా ఒక్క విక్రమ్ కు మాత్రమే ఉందాని ఇప్పటికే సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీలో టాక్. శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి సినిమాల్లో తన గెటప్స్‌తో ఆడియెన్స్‌ని మైమరపించిన విక్రమ్, ఇప్పుడు తాజాగా మరోసారి తన నటనతో పాటు గెటప్స్‌తో కూడా అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి ఇరు మురుగన్ అనే కొత్త సినిమాతో సిద్ధమయ్యాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే విక్రమ్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో నటించాడని తెలుస్తోంది. ఇక విక్రమ్ గెటప్స్ ట్రైలర్లో హైలైట్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగా కూడా విక్రమ్ చూపించిన వేరియేషన్స్ ఆడియెన్స్‌ను చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రచ్చ రచ్చ చేస్తోంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా, నయనతార, నిత్యా మీనన్ లు హీరోయిన్లుగా నటించారు.