డాన్స్ అంటే ఇష్టం అని చెప్పడం వేరే. ఆ ఇష్టానికి తగిన విధంగా శ్రమ పడి, కష్టమైనా ఇష్టం కాబట్టి చేయడం వేరే. ప్రస్తుతం తమన్నా రెండో దశలో ఉంది. డాన్స్ అంటే విపరీతంగా ఇష్టం అని చెప్పే ఈ పాప, ఎన్నో సినిమాల్లో, స్టార్ హీరోలకి సైతం డాన్స్ విషయంలో గట్టి పోటీ ఇచ్చింది. టాలీవుడ్ గొప్ప డాన్సర్ లైన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పక్కన కూడా, తమన్నా డాన్స్ తో ఆడియెన్స్ చూపుని తనవైపు తిప్పుకోగలిగింది.
అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఇండియన్ మైఖేల్ జాక్సన్ ఐన ప్రభుదేవా చేతిలో పడితే అదిరిపోదూ? సరిగ్గా అదే జరిగింది. తెలుగు, తమిళ్ లో అభినేత్రి గా, హిందీ లో డెవిల్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఒక సినిమాకి సంబంధించిన అఫీషియల్ టీజర్ ఇప్పుడే విడుదలైంది. తమన్నా డ్యాన్స్ ని మాత్రమే ఫోకస్ చేసే ఈ టీజర్, ఇప్పటికే సోషల్ మీడియా లో పరిగెడుతుంది. ధనుష్, కోన వెంకట్ లాంటి సెలెబ్రిటీలు, డాన్స్ లో తమన్నా తర్వాతే ఎవరైనా అంటూ పొగడ్తల వర్షం కూడా కురిపిస్తున్నారు. మరి ఆ రేంజ్ టీజర్ మీక్కూడా చూడాలనుండి కదూ? అయితే మీకోసం ఈ టీజర్.